సిఎం కెసిఆర్ పై తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి నా కార్యాలయంలో రెండు గంటలు నిర్భంధించారని..నా కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లను ఎత్తుకెల్లారని నిప్పులు చెరిగారు. 7200 మూవ్ మెంట్ కార్యాచరణ హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లాలని చూశారు… కానీ ఆ హార్డ్ డిస్క్ నా దగ్గరే ఉందని తెలిపారు.
గంగుల కమలాకర్ గ్రానైట్ రాయి, మైహోమ్ రామేశ్వరరావు సిమెంటు తో కేసీఆర్ కు రాజకీయ సమాధి కడతానని హెచ్చరించారు. ఆగస్టు 29 కి కేసీఆర్ ను మన కోర్టులోకి తెస్తానని సవాల్ విసిరారు. వరంగల్ ను తెలంగాణకు రాజధానిగా ప్రకటించాలని.. సిఎం కేసీఆర్ ఒక పాస్ పోర్ట్ బ్రోకర్ అని మండిపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కి ఓటమి తప్పదని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా అందాల్సిన అవసరం ఉందని.. సిఎం కేసీఆర్ మీద ఒట్టేసి చెబుతున్నా నేను రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. ప్రజారాజ్య స్థాపనే 7200 మూవ్ మెంట్ లక్ష్యమని పేర్కొన్నారు తీన్మార్ మల్లన్న.