కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్ట్ లో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చినవారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని పేర్కొంది. వారు సాధారణ కరోనా ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు అంత ర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది కేంద్ర ప్రభుత్వం.
కొత్త నిబంధనలను జనవరి 22 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వీటిని అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శక లో మిగిలిన నిబంధనలు ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనల వర్తిస్తాయని తాజా ఉత్తర్వు ల్లో స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. కాగా గడిచిన 24 గంటల్లో దేశం లో 3,47, 254 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.