మగాళ్ళకు సెక్సీగా అనిపించే ఆడవాళ్ళు చేసే సాధారణ పనులు..

-

సెక్సీనెస్ అనేది ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఉంటుంది. అవతలి వాళ్ళు చేసే ఎలాంటి చర్యలు ఎవరికి సెక్సీగా అనిపిస్తాయో చెప్పలేం. అమ్మాయి వేసుకునే నార్మల్ డ్రెస్, పైజామా, నైటీ ఇలా.. ఇంకా పొద్దున్న లేవగానే కనిపించే ముఖం, టీవీ చూస్తున్నప్పుడు.. ఇలా రకరకాల టైమ్ లలో మగాళ్ళకి సెక్సీనెస్ కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా సాధారణ పనుల్లో ఆడవాళ్ళు సెక్సీగా కనిపించే కొన్ని అంశాల గురించి చర్చిద్దాం. ముందే చెప్పినట్టు అవతలి వారిలో సెక్సీనెస్ అనేది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.

వర్కౌట్స్

వర్కౌట్లు చేస్తున్నప్పుడు కూడా ఆడతనం కోల్పోని అమ్మాయిలను మగాళ్ళు చాలా ఇష్టపడతారు. అమ్మాయిలు కెటిల్ బెల్ స్వింగ్ చేస్తున్నప్పుడు మగాళ్ళకు ఎక్కువ సెక్సీగా కనిపిస్తారని ఒకానొక అధ్యయనం చెబుతుంది.

కాఫీ సిప్

కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పడం మగాళ్ళకి చాలా సెక్సీగా కనిపిస్తుంది. అందరికీ కాకపోయినా పక్కన కూర్చుని కాఫీ సిప్ చేసేవారు లేదా వైన్ గ్లాసుని చేతిలో పట్టుకున్నవారు మగాళ్ళకి అందంగా కనిపిస్తారు.

పచ్చబొట్టు పదనిసలు

ఇద్దరు కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు తన చర్మం మీద ఉన్న పచ్చబొట్టు వెనక కథ చెబుతుంటే దాన్ని మగాళ్ళు చాలా సెక్సీగా ఫీల్ అవుతారట.

దారి తీసేవారు

ఏదైనా ట్రిప్ కి వెళ్ళినపుడు తెలియని ప్రదేశంలో కూడా దారి తీసి ముందుకు నడిచే ఆడవాళ్ళు మగవాళ్ళకి సెక్సీగా కనిపిస్తారు.

పిల్లలతో ఆడుకునేటపుడు

వినడానికి విడ్డూరంగా ఉన్నా, పిల్లలతో ఆడుకునే మహిళల్లో సెక్సీనెస్ కనిపిస్తుందని చాలామంది మగవాళ్ళ అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version