T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన తీరుపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘టీన్ఇండియా లోస్కోరుకే పరిమితం కావడంతో పాకిస్తాన్ చేతిలో ఓటమి తప్పదనే భావనను మాకు కలిగించింది. కానీ తీవ్ర ఒత్తిడిలో మన ప్లేయర్లు విజయాన్ని పాక్ నుంచి లాక్కొని వారికి ఘోర అవమానాన్ని మిగిల్చారు. రోహిత్ సేన ఎదురుదాడి దారుణం. ఆటలో మీరెప్పటికీ హీరోలుగా ఉండాలి. ఇదే నేను మీకు విధిస్తున్న శిక్ష’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా, కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు అలౌట్ అయింది. అటు పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో…7 వికెట్లు నష్టపోయి 113 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా దాటికి.. పాకిస్తాన్ బ్యాటర్లు విలవిలాడిపోయారు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.