తిరుమలలో మృతి చెందిన యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలులో రద్దు చేసిన నోట్లు కూడా…!

-

తిరుమలలో యాచకుడు ఇంట్లో లక్షలాది రూపాయలు దొరికాయి. అయితే బిచ్చగాడు ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన టిటిడి అధికారులకు ఇంట్లో పెద్ద మొత్తం డబ్బు కనిపించింది. దీంతో వాళ్ళు షాక్ కి గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల రూపాయలు వాళ్లకి లభించాయి.

నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా మారింది. అయితే ఈ డబ్బంతా కూడా తిరుమలలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించి మృతిచెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాయి. ఈ డబ్బును టిటిడి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసాచారి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ భిక్షాటన చేస్తూ భారీగా డబ్బును పోగు చేసుకున్నాడు.

అయితే ఆ డబ్బంతా కూడా ఇంట్లోనే భద్రపరచుకోవడం జరిగింది. అనారోగ్యం కారణంగా అతను గత ఏడాది మృతిచెందాడు. అయితే అతనికి ఎవరూ లేకపోవడంతో ఆ డబ్బును టీటీడీ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది.

విజిలెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులు సోమవారం అక్కడికి చేరుకుని తనిఖీలు చేశారు ఇంట్లో వెతికితే రెండు రంగు పెట్టెలో చిల్లర లభించింది. అదే విధంగా కరెన్సీ నోట్లు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ ఉన్నాయి. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాటిలో పాత వెయ్యి రూపాయలు మరియు 500 నోట్లు కూడా ఉన్నాయి. సుమారు ఇవి 10 లక్షల రూపాయలు ఉంటాయని వాటిని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించినట్లు టీటీడీ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version