మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండూ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు అని చెప్పవచ్చు. కానీ బుల్లితెరపై అతడు, ఖలేజా సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. అందుకే మహేష్ బాబు మూడోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకోలేదు కానీ ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పటికే కథ కూడా వినిపించినట్లు.. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి యూరప్ వెళ్లిన విషయం తెలిసిందే.
అందుకే కనుమరుగైపోయిన నందమూరి హీరో తారకరత్న ను విలన్గా ప్రవేశపెట్ట బోతున్నాడు అని పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఈ విషయంపై స్పందించిన తారకరత్న అలాంటిదేమీ లేదు అని.. తనకు సంబంధించిన ప్రతి విషయం కూడా తన పి ఆర్ టీమ్ చూసుకుంటుందని.. ఎవరో కావాలనే వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని అలా చేయవద్దు అంటూ క్లారిటీ ఇచ్చాడు.