మునుగోడు సభకు టీఆర్ఎస్, సీపీఐ..ఒకే కారులో కేసీఆర్, చాడ !

-

మునుగోడు ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి సీపీఐ పార్టీ మద్దతు తెలిపినట్లు సమాచారం అందుతోంది. మునుగోడు ఎన్నికల ప్రచారానికి రావాలని సీపీఐ పార్టీని కోరారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలోనే…మునుగోడు సభకు వెళ్లాలని సీపీఐ పార్టీ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఇవాళ సీఎం కేసీఆర్‌ వాహనం లోనే చాడా వెంకట్‌ రెడ్డి.. మునుగోడు సభకు వెళ్లనున్నారు. అంతేకాదు… మునుగోడు సభా వేదికను సీఎం కెసిఆర్, సీపీఐ చాడా వెంకట్ రెడ్డి.. పంచుకోనున్నారు. ఈ బహిరంగ సభలోనే.. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

బీజేపీ పార్టీని ఓడించే ఏ పార్టీతో నైనా తాము పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గతం నుంచే సీపీఐ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది సీపీఐ. ఇక అటు సీపీఎం కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకే మద్దతు తెలిపే ఛాన్స్‌ ఉంది. కాగా.. ఇవాళ సాయంత్రం మునుగోడు టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరుగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version