టిఆర్ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వామపక్షాల బిక్షతో మునుగోడులో టిఆర్ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే సూది, డబ్బునం పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ కి పిలిపించుకున్నారని దుయ్యబట్టారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు సీఎం కేసీఆర్ కి అలవాటేనని మండిపడ్డారు.
33 గిరిజన తండాల్లో ఉన్న 13వేల ఓట్ల కోసం గిరిజన రిజర్వేషన్ ప్రకటించారని ఆరోపించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా బిజెపి నైతికంగా విజయం సాధించిందనిి అన్నారు. ఇక బిజెపి మరో నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్న్యాయం తామేనని అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మునుగోడులో టిఆర్ఎస్ దుష్ప్రచారాలు చేసి గెలిచిందని ఆయన ఆరోపించారు. 2023లో రాష్ట్రంలో కచ్చితంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.