ఫుడ్ పాయిజనింగ్ నుంచి బయటపడేందుకు ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి

-

మీకెప్పుడైనా ఇలా అనిపించిందా..అసలు మనం చేసే పని మనం కడపునిండా తినడానికే కదా..ఎన్ని చేసినా, ఏం చేసినా ఆ బుజ్జి కడుపును నింపుకోవడానికే కదా..మరి తినడానికి కూడా టైం లేకుండా పోతుందేంటి అని..చాలామందికి ఇదే జరుగుతుంది..బిజీ బిజీ లైఫ్..బుజ్జిపొట్టను ఇగ్నోర్ చేస్తున్నారు. దానికి కావాల్సింది పెట్టకుండా..మన దగ్గర ఏది ఉంటే అది పెట్టేస్తున్నాం. వాటిలో ఫాస్ట్‌ఫుడ్‌తోపాటు అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అయితే.. ఈ ఆహారపు అలవాట్ల వల్ల కొన్నిసార్లు అనారోగ్యం బారిన పడే అవకాశముంది.

శరీరానికి పడని ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.. ఈ క్రమంలో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి వస్తాయి. ఇలాంటి ఉపశమనం పొందేందుకు వైద్యుని సలహాతో పాటు, ఇంటి చిట్కాలు కూడా పాటించవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు పాటించే హోమ్ రెమిడీస్ గురించి ఇప్పుడు చూద్దాం..

వెనిగర్: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాపిల్ సైడర్ వెనిగర్ జీవక్రియను పెంచే లక్షణాలను కలిగి ఉంటుందట. వెనిగర్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని చెడు మూలకాలు బయటకు వెళ్తాయి.

నిమ్మకాయ: ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇది అనేక కడుపు సమస్యలను నయం చేసే శక్తి..నిమ్మకాయకు ఉంది. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ రసం, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయతో ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియాను దూరం చేసుకోవచ్చు..

తులసి ఆకులు: ఔషధ గుణాలకు తులసి ఆకులు పెట్టింది పేరు..ఇవి ఉదర సంబంధిత వ్యాధులను సైతం దూరం చేస్తాయి. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తులసిని పెరుగులో కలిపి తినాలి. కావాలంటే పెరుగు బదులు తులసి టీ కూడా తాగవచ్చు. దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది.

పెరుగు: ఇందులోని యాంటీబయాటిక్ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే ఫుడ్ పాయిజనింగ్ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు పెరుగులో కాస్త నల్ల ఉప్పును కలిపి తీసుకుంటే మరీ మంచిది.

వాము – జీలకర్ర: కడుపులో మంట, గ్యాస్ ఉంటే వాము, జీలకర్ర పొడిని నీళ్లల్లో కలుపుకొని తాగండి..దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీని కోసం ముందుగా వాము, జీలకర్ర గింజలను కొద్ది వేయించి పొడి చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి దానిలో కొంచెం నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే. వెంటనే రిలీఫ్ వస్తుంది.

వీటిలో ఏదైన సరే మీకు అందుబాటులో ఉన్నది..కడుపునొప్పి సమస్యలువచ్చినప్పుడు ట్రై చేయండి..నొప్పి ఎంతకి తగ్గకపోతే అప్పుడు వైద్యలను సంప్రదించండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news