విద్యార్థులకు అలర్ట్.. రేపు పీఈసెట్-2022 ఫలితాలు

-

తెలంగాణలోని విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 24న టీఎస్ పీఈసెట్-2022 ఫలితాలు విడుదల కానున్నాయి. పీఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి.. మాసాబ్‌ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

TS PECET-2022: Physical Education Common Entrance Test TSUPDATE

అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(యూజీడీపీఈడీ), బ్యాచులర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు జరిగిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 3,659 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,340 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news