నీచుడ.. తల్లిని, చెల్లినీ వదలని కామాంధుడు..

-

ఓ నీచుడు.. అన్న అనే పదానికి మాయని మచ్చను తీసుకువచ్చాడు. అన్నింట్లో అండగా ఉండాల్సిన అన్నే.. ఆ చెల్లెళ్ల పాలిట మృగాడుగా మారాడు. అన్యం పుణ్యం తెలియని మైనర్లైన చెల్లెళ్లపై  ఎవరికీ తెలియకుండా ఆత్యాచారం చేస్తూ.. తన కామవాంఛ తీర్చుకున్నాడు. విషయం తెలిసి అడ్డం వచ్చిన తల్లిపై సైతం అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఝార్ఖండ్​లోని లోహర్​దగా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడేళ్లుగా మైనర్లు అయిన తన ఇద్దరి చెల్లెళ్లపై నిందితుడు అత్యాచారానికి పాల్పడేవాడు.

ఇటీవల మరోసారి అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన బాధితురాళ్లు తల్లికి ఈ విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలో తల్లిపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ కామాంధుడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడం వల్ల పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. అయితే స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరి శిక్ష విధించాలని కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version