మళ్లీ వేడెక్కుతున్న ‘మహా’ రాజకీయాలు.. షిండేకు ఉద్ధవ్‌ సవాల్‌..

మొన్నటి వరకు ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరోసారి వేడెక్కుతున్నాయి. నేడు బలపరీక్షలో నెగ్గిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు రావాలని, ఎవరేమిటో ప్రజలే తీర్పు చెబుతారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. ఇదంతా శివసేన పార్టీ అనేదే లేకుండా చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు ఉద్ధవ్ థాక్రే. సోమవారం శివసేన బీజేపీ జిల్లా అధ్యక్షులతో ఉద్ధవ్ థాక్రే సమావేశమయ్యారు. పోరాటం చేసేందుకు అంతా కలిసికట్టుగా నిలవాలని కోరారు ఉద్ధవ్ థాక్రే.

Uddhav Thackeray resigns as Maharashtra CM, quits as MLC too | India News |  Zee News

అనంతరం ఈ భేటీ వివరాలతో పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర ఇది. వాళ్లకు నేను సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రాజీనామా చేసి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు రావాలి. ఈ ఆటలు ఆడే బదులు.. ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం. ఒకవేళ మేం తప్పు చేసి ఉంటే ప్రజలే మమ్మల్ని ఇంటికి సాగనంపుతారు. ఒకవేళ మీరు (బీజేపీ, ఏక్ నాథ్ షిండే గ్రూప్) తప్పు అయితే ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపుతారు.” అని సవాల్ చేశారు ఉద్ధవ్ థాక్రే.