Breaking : రైతులకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. ఆ పంటలపై మద్దతు ధర పెంపు

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైతాంగానికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహం అందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.

Telangana revolutionises farming with developmental programmes'

కేంద్రం నిర్ణయంతో మద్దతు ధర పెరిగిన పంటలు ఎర్ర కందిపప్పు- క్వింటాలుకు రూ.500 పెంపు, ఆవాలు- క్వింటాలుకు రూ.400 పెంపు, కుసుమ – క్వింటాలుకు రూ.209 పెంపు, గోధుమలు- క్వింటాలుకు రూ.110 పెంపు, బార్లీ- క్వింటాలుకు రూ.100 పెంపు, శనగలు – క్వింటాలుకు రూ.105 పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news