Viral Video : ఒకే చోట ఎదురుపడిన చిరుత, పులి.. ఏం చేశాయంటే..?

-

పులి, చిరుత సాధారణంగా ఎదురుపడితే ఎలా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్లు ఒకదానిపై మరొకటి తలపడేందుకు రెడీగా ఉంటాయి. కదనరంగంలోకి దిగి తమ సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతుంటాయి. ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలని తపన పడుతూ ఉంటాయి.

కానీ ఇక్కడ మాత్రం పులి, చిరుత చాలా అసాధరణంగా వ్యవహరించాయి. ఒకదానికొకటి ఎదురుపడినా ఎలాంటి అలికిడి చేయలేదు. అసలు ఈ రెండు ఎదురుపడ్డాక ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఓ వీడియోను ట్విటర్​లో పోస్టు చేశారు. ఇది అసాధారణ ప్రవర్తన అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో పులి, చిరుత ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. దూరం నుంచి చెట్టుపై ఉన్న చిరుతను పులి గమనిస్తూ ఉంటుంది. చిరుత కిందకు దూకగానే పులి దాని వద్దకు వెళ్లింది. అయితే రెండు ఒకదానికొకటి ఎదురుపడ్డా తలపడలేదు. కాసేపు ఒకరినొకరు చూసుకున్నాయి. తర్వాత రెండు వాటి దారిలో అవి వెళ్లాయి. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version