షూటింగ్‌లో వీజే సన్నీకి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

-

చాలా కాలం క్రితమే యాంకర్ గా  కెరీర్ ను ప్రారంభించి.. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి ఎనలేని ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు వీజే సన్నీ. ఈ షో తర్వాత అతడి కెరీర్ కు మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ టాలెంటెడ్ కుర్రాడు ‘ఏటీఎమ్ ‘ అనే వెబ్ సిరీస్లో నటించి మెప్పించాడు. అలాగే ఎన్నో సినిమాల్లోనూ హీరోగా నటిస్తున్నాడు. సన్నీ ప్రస్తుతం ‘అన్స్టాపబుల్’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. డైమండ్ రత్నబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు.

ఈ చిత్రం ప్రమోషనల్‌ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. థర్టీ ఇయర్స్ పృథ్వి, సప్తగిరి, వీజే సన్నీ ప్రోమో షూట్‌లో పాల్గొన్నారు. పోలీస్‌ గెటప్‌లో ఉన్న సప్తగిరి రివాల్వర్‌ చూపిస్తూ.. పృథ్విని అన్‌స్టాపబుల్‌ రిలీజ్ ఎప్పుడని అడుగగా.. పృథ్వి తనకు తెలియదని సమాధానం చెప్పాడు. ఈ ఇద్దరి మధ్యలోకి వచ్చిన వీజే సన్నీపై రివాల్వర్‌ ఎక్కుపెట్టి సప్తగిరి అదే ప్రశ్న అడుగుతాడు. అయితే ఇదే క్రమంలో సప్తగిరి చేతిలో ఉన్న రివాల్వర్‌ పేలి.. అందులో ఉన్న డమ్మీ బుల్లెట్‌ సన్నీ భుజంపై తాకింది. దీంతో గాయమైన వీజే సన్నీని చిత్రయూనిట్‌ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version