Bangarraju : బంగార్రాజు టైటిల్ సాంగ్ రిలీజ్‌.. అక్కినేని ఫ్యాన్స్ కు ఇక పూన‌కాలే

-

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమా.. బాక్స్ ఆఫీసు ను బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. పంచ‌కట్టు లో స‌ర‌సాలు, చిలిపి వేశాల‌కు బాక్స్ ఆఫీసు మోత మోగింది. బంగార్రాజు గా నాగార్జున చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.

ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. ఇవాళ అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. “బంగార్రాజు” అంటూ సాగే.. పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక పాట‌లో.. ఫ‌రియా అబ్దుల్లా, నాగ చైత‌న్య త‌మ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. అటు శేఖ‌ర్ మాస్ట‌ర్ చేయించిన స్టెప్పులు సినిమాకే హైలెట్ గా నిలిచేలా క‌నిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మాస్ సాంగ్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version