వాస్తు: భార్య భర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఈ మార్పులు చేయండి..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది ఈ మధ్య వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ని ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు చిట్కాలని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలు అన్నిటికి దూరంగా ఉండొచ్చు ఇక ఇప్పుడు మనం కొన్ని వాస్తు చిట్కాలను చూసేద్దాం.

వాస్తు ప్రకారం వస్తువులను ఉంచితే ఆరోగ్యంగా ఆనందంగా జీవించొచ్చు అలానే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివిటీ వస్తుంది. ఏదైనా వస్తువు ఇంట్లో పెట్టే ముందు వాస్తు ప్రకారం మనం అనుసరించాలి. ఏనుగులు తొండం ఎత్తి ఉన్న ఫోటోని లక్ష్మీదేవితో పాటుగా పెడితే ఇంట్లో మంచి జరుగుతుంది మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. లివింగ్ రూమ్ లో పెట్టేటప్పుడు దేవుడు ఫోటోలని పెడితే చాలా మంచిది. అలానే నవ్వుతూ ఉన్న ఉమ్మడి కుటుంబం ఫోటోని కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది బెడ్ రూమ్ లో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకుంటే ఎంతో మేలు కలుగుతుంది.

లేదంటే జంట హంసల ఫోటోని కూడా పెట్టొచ్చు. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది నాట్యం చేస్తున్న నెమలి ఫోటోని కూడా మీరు బెడ్ రూమ్ లో పెట్టుకోవచ్చు. పిల్లల్ని కనాలని అనుకునే వాళ్ళు కృష్ణుడి ఫోటోని పెట్టుకుంటే మంచిది. బాలకృష్ణుడు ఫోటోని పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పక్షులని కూడా పెట్టుకోవచ్చు. అదే స్టడీ రూమ్ లో అయితే సరస్వతి దేవి ఫోటో ని పెట్టుకుంటే మంచిది ఇలా ఈ విధంగా అనుసరిస్తే మంచి ఫలితాలను పొందడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version