Drushyam 2 movie review: దృశ్యం 2 మూవీ రివ్యూ: విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన చిత్రం దృశ్యం. 2014లో విడుదలైనా ఈ చిత్రం ఎలాంటి సెన్సెషనల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. సుమారు 7 ఏళ్ల తర్వాత.. ఆ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 వచ్చింది. అయితే.. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేశారు మూవీ మేకర్స్. దృశ్యం సినిమా మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చిందా.. ? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. కథ, కథనాలపై ఓ లూక్ వేయాల్సందే..
ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రూపొందించిన దృశ్యం 2 చిత్రం అనూహ్యంగా ప్రైమ్ రిలీజ్ చేయడం ఓ సంచలనం. చాలా గ్యాప్ తరువాత.. దృశ్యం మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం. ఆకట్టుకునే బలమైన కంటెంట్ తో ఈ చిత్రం నిర్మితమైందనే నమ్మకంతోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ లాల్ నటించిన మలయాళం వెర్షన్ కూడా ప్రైమ్ లో రిలీజై భారీ విజయాన్ని సాధించింది. దీంతో తెలుగు వెర్షన్ పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సీక్వెల్ లో కథేంటి వంటి విషయాలతో రివ్యూలో ముందుకెళద్దాం..
అసలు కథేంటీ?
దృశ్యం 1 ముగింపు నుంచి దృశ్యం 2 ప్రారంభమవుతుంది. ఆరేండ్ల తరువాత.. రాంబాబు (వెంకటేష్) కుటుంబం ఆర్దికంగా వెల్ సెటిల్ అవుతుంది. కేబుల్ ఆపరేటర్ గా ఉన్న రాంబాబు సినిమా థియేటర్ ఓనర్‌గా మారుతాడు. సినిమాలే లోకంగా జీవించే రాంబాబు.. సినిమా తీయాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అంత సాఫీగా జరుగుతోందనే తరుణంలో.. గతంలో జరిగిన వరుణ్ హత్య తన కుటుంబాన్ని వెంటాడుతుంది. రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) లు రీఏంట్రీ ఇస్తారు. దీంతో మళ్లీ రాంబాబు కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
ఆరేండ్ల తరువాత.. తన కొడుకు వరుణ్ కేసును గీతా ప్రభాకరన్ దంపతులు మళ్లీ ఎలా తోడారు?
రాంబాబు నుంచి వారు ఏం ఆశించారు? ఈ సమయంలో రాంబాబు ఏం చేశాడు ? ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో పూడ్చిన వరుణ్ శవాన్ని పోలీసులు కనిపెడుతారా..? ఆ శవాన్ని కనిపెడితే.. రాంబాబుకు శిక్ష పడుతుందా? ఆ కేసు నుంచి రాంబాబు ఎలా గట్టెక్కాడు? ఈ కథలో ప్రఖ్యాత రచయిత విజయ్ చంద్ర పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దృశ్యం 2 సినిమా కథ.
ఎనాలసిస్ ..
‘దృశ్యం’ లో వెంకటేష్ తన కుటుంబాన్ని సినిమా నాలెడ్జ్ తో కూడిన తెలివితో కాపాడుకున్నాడు. అయితే హత్యకు గురైన కుర్రాడి శవం దొరకలేదు. డెడ్ బాడీ లేకపోతే కేసు ముందుకు నడవదు. నేరం నిరూపణ కాదు..శిక్ష పడలేదు. అలా ఆ కథ ముగిసింది అనుకుంటాం. కానీ, ఆ కేసును పూర్తిగా క్లోస్ చేయరు పోలీసులు. రాంబాబు కుటుంబాన్ని వరుణ్ హత్య కేసు ఏదో రూపంలో వెంటాడుతోంది.
వర్షం వచ్చినప్పుడో? పోలీస్ సైరన్ విన్నప్పుడూ జ్యోతి(మీనా), తన కూతుళ్లు అంజు, అను (కృతిక, ఏస్తర్ అనిల్) ఉలికి పడుతూనే ఉంటారు. భయంతో వణికిపోతున్నారు. మరోవైపు రాంబాబు ఆర్దికంగా ఎదగడంతో ఊరివాళ్లు కూడా అసూయ పెంచుకుంటారు. అతని కుటుంబం వెనుక రూమర్స్ జనం చెప్పుకుంటున్నారు.
మరోవైపు పోలీసులు రాంబాబు కుటుంబాన్ని ఏదో విధంగా అనుమానిస్తునే ఉంటారు. ఏదోక చిన్న క్లూ అయినా దొరక్కపోతుందా అని మనుష్యుల చుట్టూ వ్యూహాలు పన్నారు. రాంబాబు కూడా కుటుంబాన్ని కూడా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎప్పటికప్పుడు ఏం జరగబోతుందో అని వేయి కళ్లతో తన
కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఈ క్రమంలో ఐజీ గౌతమ్ సాహూ(సంపత్ రాజ్) ఎంట్రీ ఇస్తాడు. కేసుని తిరిగి ఓపెన్ చేసాడు. అప్పుడేం జరిగింది? ఈ దృశ్యం 2 లో కూడా కుటుంబమే గెలుస్తుందా.? పోలీసులే గెలుస్తారా? .. పోలీసుల పద్మవ్యూహంలో రాంబాబు చిక్కుతాడా? అనేది కథాంశం సినిమా ఫస్ట్ పార్ట్ కు ఫెరఫెక్ట్ సీక్వెల్ ఇది. ఫస్ట్ ఫార్ట్ లో జరిగిన కథను కంటిన్యూ చేస్తూ సాగటమే ఈ సినిమాకు బ్యూటీ.
దృశ్యం 2 చిత్రంలో సెకంఢాఫ్ లో హత్య కేసు విచారణ, దర్యాప్తు అంశాలు కీలకంగా ఆసక్తికరంగా మారుతాయి. రాంబాబుకి తెలియకుండా.. పోలీసులు ఈ కేసులో రహస్య ఎంక్వైరీ ప్రారంభం చేస్తారు. ఈ క్రమంలో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరకడం.. దీంతో సోర్టీ ఇంకా ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఈ కేసులో రాంబాబు విషయంలో పోలీసులు ఎలా డీల్ చేశారు.. అతడిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి ప్లాన్స్ చేశారనేవి ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ క్రమంలో పోలీసులను దారి తప్పించే ప్రయత్నం ఏలా చేస్తాడు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాంబాబు ఎలాంటి ప్లాన్స్ వేస్తారు. అనుకోని.. ఉహించని ట్విస్టుల మధ్య ఈ సినిమా ముగుస్తుంది.
ఫస్టాఫ్ లో దృశ్యం 1 సీక్వెల్ గానే స్టోరీ నడుస్తోంది. పోలీసు దంపతులతో.. కథా పట్టాలెక్కుతుందో. ఎప్పుడైతే ఫస్ట్ ట్విస్ట్ రివీల్ అయ్యిందో అక్కడ నుంచి ఆసక్తిగా చూడటం మొదలెడతాం. వాస్తవానికి ఈ కథకు సెకండాఫే బలం. అక్కడ నుంచే ప్రేక్షకుడుని గ్రిప్ లోకి తీసుకుంటుంది. పూర్తిగా అనుహ్యా మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ.. చివరికి వావ్ అనిపించేలా ఈ మూవీని ముగించేశారు. తొలి సీన్ నుంచే కథను సీడ్స్ వేసుకుంటూ ప్రయత్నించాడు దర్శకుడు.
దర్శకుడు జీతు జోసెఫ్.. తనదైన మార్క్ చూపించాడు. సినిమాను ఎంత ఎఫెక్టివ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్ లో ట్విస్టులతో హై రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లాడు. కుటుంబ సంబంధాలను, భావోద్వేగాలను జొప్పించే తీరు సినిమాకు మరింత పాజిటివ్‌గా మారాయి. సస్పెన్స్, థ్రిల్లర్స్ ఆదరించే వారికి దృశ్యం 2 కూడా నచ్చేలా తెరకెక్కించారని చెప్పవచ్చు
ఎవరెలా చేసారంటే…
వెంకటేష్.. రాంబాబు పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా తెర మీద పాత్రలను సజీవంగా కనిపించేలా చేశారు. అలాగే.. మీనా.. జ్యోతి పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్.. సటిల్ యాక్టింగ్.. కొలిచినట్లుగా ఇచ్చే హావభావాలు బాగా సెట్ అయ్యాయి. ఇక కథలో అంజుగా కృతిక, అనుగా ఎస్తర్ అనిల్ భాగమయ్యారు. తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. సెంటిమెంట్ సీన్లలో మరింతగా మెప్పించారు. సెకండాఫ్‌లో వెంకటేష్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నారు. భావోద్వేగాలను భారీగా పండించాడు.
అలాగే ఐజీగా చేసిన సంపత్ సరిగ్గా సెట్ అయ్యారు. నిజమైన పోలీస్ అధికారిగా కనిపించారు. తనదైన శైలిలో కథలో కీలకంగా మారారు. మిగితా పాత్రల్లో అంటే గీత గా నదియా, ప్రభాకరన్ గా నరేష్ తమ పాత్రలో ఒదిగిపోయారు. తన కొడుకు ఆచూకీ తెలియకుండా పోతే.. తల్లిదండ్రులు పడే బాధను, ఆ ఎమోషన్ ను స్క్రీన్ మీద ప్రతిబింబింప చేశారు. మిగితా పాత్రధారులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. ఇక తణికెళ్ళ భరణి, పూర్ణ, షఫి, తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారు. ఫోర్శినిక్ సర్జన్ గా చేసిన శశి ఉన్నది కాసేపు అయినా నాచురల్ గా చేసారు.
టెక్నికల్ గా చూస్తే..
దృశ్యం 2 చిత్రానికి అనూప్ రూబెన్ష్ బాణీలు అద్బుతం. సీన్స్ లో ఉత్కంఠని నింపుతూ బ్యాగ్రౌండ్ స్కోర్ డిజైన్ చేసారు. అదే ఈ సినిమాకు బలం. ఇక సినిమాటోగ్రాఫర్ సతీష్ కురూప్ చిత్రకీరించిన సన్నివేశాలు
చాలా బాగున్నాయి. ప్రకృతిని, పచ్చటి దృశ్యాలను తెరపైన అందంగా చూపించారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్రిల్లర్ల స్పెషలిస్ట్ గా ఈ కథని డిజైన్ చేసారు. ఏదో మొక్కుబడిగా సీక్వెల్ తీసేయకుండా ఎంతో కసరత్తు చేసి అతనీ స్క్రిప్టును తీర్చిదిద్దారు. స్క్రీన్ ప్లే ‘దృశ్యం-2’లో అది పెద్ద హైలైట్.
నచ్చినవి:
స్టోరీ లైన్
సెకండాఫ్ స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్
నచ్చనవి:
స్లోగా నడవటం
మొదట అరగంటా పెద్దగా కిక్ ఇవ్వకపోవటం
రేటింగ్-3/5
బ్యానర్: సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్;
నటీనటులు: వెంకటేశ్, మీనా, కృతిక, ఏస్తర్ అనిల్, సంపత్ రాజ్, నదియా, నరేశ్, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్, షఫీ తదితరులు;
సంగీతం: అనూప్ రూబెన్స్;
సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్;
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్;
నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి;
రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్;
రన్ టైమ్: 2hr 34 Mins.
విడుదల: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: 25,నవంబర్ 2021