ఈనాడు ఛానెల్ పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ఎయిమ్స్ పై మొన్న చంద్రబాబు మాట్లాడితే ఈ రోజు ఈనాడులో చుక్కలు చూపిస్తున్నారంటూ రాశారని.. ఎయిమ్స్ పై ఈనాడు దుష్పచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు చంద్రబాబు మాడ్లాడతారు…తర్వాత ఈనాడులో రాస్తారని.. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ ట్వీట్ చేస్తారని మండిపడ్డారు.
ఎయిమ్స్ పై అసలు ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని.. ఏ సంస్ధ ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలు ఉండాలని తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరిలో ఎయిమ్స్ ప్రారంభమైందని.. ఎయిమ్స్ లో మంచినీటి సమస్యపై తాత్కాలిక చర్యలు తీసుకున్నామన్నారు. 2 నుంచి 3 లక్షల లీటర్ల నీటిని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల నుంచి అందజేస్తున్నాం.. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి డిమాండ్ కి తగినట్టుగా అదనంగా మరో మూడు లక్షల లీటర్ల మంచినీటి సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.
ఎయిమ్స్‌లో మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారంకి చర్యలు తీసుకున్నామని.. భవిష్యత్ లో రోజుకి 25 లక్షల నీటి అవసరాన్ని గుర్తించి 534 జిఓ ఇచ్చి 26 జులై 2022 న రూ.7.74 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. ఈ దుష్ట చతుష్టయం చేసే దుష్ప్రచారాలని ప్రజలెవ్వరూ నమ్మారు.. జగనన్న ప్రభుత్వంలోనే ఎయిమ్స్ కి న్యాయం జరిగిందని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని.