రికార్డుల కింగ్ విరాట్ కొహ్లీ ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ లు మరియు వన్ డే లను ఆడనున్నాడు. కానీ టీ 20 లలో సభ్యుడిగా లేకపోవడం గమనార్హం. కాగా మరో రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ముందు ఒక రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు తన క్రికెట్ కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ ప్రఖ్యాతులను గాంచాడు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో కొడుకు మరియు తండ్రులతో క్రికెట్ ఆడిన మొదటి క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ఘనతను సాధించాడు. సచిన్ 1992 లో జెఫ్ మార్ష్ తో కల్సి ఆడగా, ఆ తర్వాత 2011లో షాన్ మార్ష్ తో ఆడాడు. ఇప్పుడు ఈ ఛాన్స్ మన కింగ్ కోహ్లీకి వచ్చింది.