బిగ్ బాష్ లీగ్ లో సంచలనం: 29 పరుగులకే స్టార్స్ మహిళలు ఆల్ అవుట్ !

-

ఈ రోజు మహిళల బిగ్ బాష్ లీగ్ లో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన స్ట్రైకర్స్ నిర్ణీత ఓవర్ లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేట్ మాక్ 86 పరుగులతో రాణించగా, వల్వర్ట్ 47 పరుగులు చేసి తనకు చక్కని సహకారం అందించింది. బదులుగా స్టార్స్ మహిళలు ఛేదనలో దారుణంగా విఫలం అయ్యారు. ఎంతలా అంటే… కనీసం టార్గెట్ ను ఛేదించడం కాదు కదా.. దరిదాపుల్లోకి కూడా వెళ్లలేక చేతులెత్తేశారు. స్ట్రైకర్స్ బౌలర్లు చేరేలేగిపోయి స్టార్స్ మహిళలను కేవలం 29 పరుగులకే ఆల్ అవుట్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నారు. షూట్, వెల్లింగ్టన్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, ముషంగ్ వె మరియు మేక్ గ్రాత్ లు రెండు వికెట్లు చొప్పున సాధించి స్టార్స్ ఓటమిని ఖరారు చేశారు.

ఈ అపజయం బిగ్ బాస్ చెరిత్రలోనే ఘోరమైనది అని చెప్పవచు. స్టార్ ప్లేయర్స్ మెగ్ లానింగ్, సోఫియా, ఆలిస్ మరియు బౌచర్ అందరూ విఫలం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version