త్వరలో మూఢం వచ్చేస్తుంది.. ఏ కార్యాలు చేయొచ్చు.. ఏవి చేయకూడదు..?

-

నాలుగు ఐదు రోజుల నుంచి పెళ్లిళ్లు బాగా పెరిగిపోయాయి కదా..! మూఢ వచ్చేస్తుంది అంట.. మూడు నెలలకు దాగా ముహుర్తాలు లేవు అని తెగ కంగారుపడిపోతున్నారు. అసలు మూఢం అంటే ఏంటి..? ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని అంటారెందుకు? ఈ ముఢంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తెలుసుకుందాం..!
2024 లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగష్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగష్టు 8 వరకూ దాదాపు మూడునెలలు మూఢం.

మూఢం అంటే?

నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు.
గ్రహాలకు రాజు సూర్యుడు.  సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయట.  సూర్యునికి  దగ్గరగా గురు , శుక్రులు  వచ్చి నప్పుడు, గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమై, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే వేయి  వాట్స్  బల్బు ముందు క్యాండిల్  పెడితే , ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుందనమాట.
గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం… ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలసిరాదన్నది పండితుల మాట.

మూఢంలో ఏఏ పనులు చేయకూడదు..?

శుభగ్రహాలైన గురు, శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో  వివాహాది శుభ కార్యాలు జరపకూడదు
లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు
పుట్టు వెంట్రుకలు తీయించకూడదు
గృహ శంకుస్థాపనలు చేయ రాదు
ఇల్లు మారకూడదు
మూఢంలో ఇవి చేసుకోవచ్చు
అన్న ప్రాసన చేసుకోవచ్చు
ప్రయాణాలు చేయవచ్చు
ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు
భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు
నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు
నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు

మూఢాల కాలంలో శుభ కార్యాలు నిర్వహిస్తే ఏం అవుతుందో..?

జ్యోతిష్య శాస్త్ర పండితులు, మహా మహా రుషులు చెప్పిన దాని ప్రకారం.. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావొచ్చు. కష్టం కలుగవచ్చు , నష్టం  వాటిల్లవచ్చు. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యం తలపెట్ట కూడదని బలంగా చెప్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version