భారత్‌పై నోరు పారేసుకున్న ట్రంప్.. ఏమన్నారంటే?

-

వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధ్యక్షుడి రేసులో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అత్యధికంగా టాక్సులు విధిస్తోందన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక పన్నులు విధిస్తానని చెప్పారు.

అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా సుమారు 200 శాతం పన్ను విధిస్తోంది. బ్రెజిల్‌లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయి.‘అమెరికాను మళ్లీ సంపన్న దేశంగా మార్చాలనేది నా ప్లాన్. మనం సాధారణంగా టారిఫ్‌లు వసూలు చేయం. నా విజన్‌లో ఇది చాలా ముఖ్యమైనది. నేను ఆ ప్రక్రియను మొదలుపెట్టా. చైనా, బ్రెజిల్ కంటే భారత్‌ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోంది. ఏదేమైనా అమెరికాకు భారత్‌తో మంచి సత్సంబంధాలున్నాయి.

పీఎం మోడీ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక ఇంధన ధరల గురించి కూడా ట్రంప్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘రానున్న 12 నెలల్లో ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ధరలను సగం తగ్గిస్తాను. విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాం.ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దీంతో అమెరికాలో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని రాసుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version