రోగులను గాలికొదిలేసి క్రిస్మస్ వేడుకల్లో మునిగితేలిన నర్సులు, సిబ్బంది.. ఎక్కడంటే?

-

ఆస్పత్రిలోని నర్సులు, సిబ్బంది రోగులను అస్సలే పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో మునిగి తేలారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మీడియా రాకను గుర్తించిన సిబ్బంది వెంటనే నృత్యాలు ఆపేశారు.

పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు చేస్తున్నట్లు వీడియాలో కనిపిస్తున్నా ఆస్పత్రి ఆర్ఎంఓ సుమన్, సిబ్బంది తమ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత స్టాఫ్ రిక్వెస్ట్ చేయటంతో అనుమతించామని ఆర్ఎంవో సుమన్ స్పష్టంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి ఆస్పత్రిలో విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version