హైదరాబాద్‌లో నేడు రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అయితే నేటి సమావేశం ముగింపు అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోడీ సహా బీజేపీ దిగ్గజాలు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతోందని, తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం అందట్లేదని మండిపడ్డారు.. ఉత్తరప్రదేశ్‌లో 15 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని, తెలంగాణలో అటువంటి పథకాలు అందట్లేదని విమర్శించారు యోగి ఆదిత్యనాథ్ . యూపీలో ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్’ భావనతో ముందుకు వెళ్తున్నామని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు యోగి ఆదిత్యనాథ్.
ప్రధాని మోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించడంతోపాటు కాశీలో విశ్వనాథుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు యోగి ఆదిత్యనాథ్ . రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు బుద్ధి చెప్పినట్టుగా, మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు యోగి ఆదిత్యనాథ్ . ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండటంతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదల కోసం 45 లక్షల ఇళ్లు కట్టించామని.. ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.