ఎన్నికల ముందు కూడా మాట మీద నిలబడవా : వైఎస్‌ షర్మిల

-

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భావి తరానికి పాఠాలు నేర్పే టీచర్ అభ్యర్థులపై కేసీఆర్ ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని ఆమె అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన వాగ్ధానం ప్రకారం 13086 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తే లాఠీలతో కొడతారా? అని ఆమె మండిపడ్డారు.

సిగ్గుందా కేసీఆర్? నిండు అసెంబ్లీలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవా? ఎన్నికల ముందు కూడా మాట మీద నిలబడవా? కొలువుల కోసం తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులను కొట్టే హక్కు నీకెక్కడిది? ఇచ్చిన మాట నిలబెట్టుకాకుండా యువత రక్తాన్ని కండ్ల చూస్తావా? నీ కుటుంబానికి ఐదు ఉద్యోగాలుంటే సరిపోతుందా? 13096 టీచర్ పోస్టులకు ముష్టి 5 వేలు బిక్షం వేస్తావా? అని ఆమె ప్రశ్నించారు.

అంతేకాకుండా.. ‘ తొమ్మిదేళ్లుగా టీచర్ పోస్టుల ఊసే ఎత్తకుండా నామమాత్రంగా పోస్టులు భర్తీ చేసి, ఓట్లు దండుకుందామనా? మాట తప్పితే తల నరుక్కునే నైజమే అయితే? నరం మీద నాలుకే ఉంటే 13086 టీచర్ పోస్టులకు కేసీఆర్ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.’ అని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version