కాళేశ్వరంలో అవినీతిపై ప్రధానికి షర్మిల లేఖ…!

-

తెలంగాణాలో మరో మూడు వారాల్లో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న BRS ను ఎలాగైనా దెబ్బ తీయడానికి కాంగ్రెస్ మరియు బీజేపీ లు కాచుకు కూర్చున్నాయి. ఇక కాంగ్రెస్ కు మద్దతును ప్రకటించిన వైఎస్ షర్మిల తాజాగా కెసిరో ప్రభుత్వంలో కరిగిన అవినీతి గురించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖలో షర్మిల చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు మరియు అందులో జరిగిన అవినీతి గురించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. రాష్ట్రము మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఈమె విమర్శించారు. అందుకే వీలైనంత తొందరలో ఈ విషయంపై విచారణకు ఆదేశించాలని మోదీని లేఖ ద్వారా కోరారు షర్మిల.

మరి ఈ లేఖ పై కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా చూడాలి. ఇక ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version