మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వైఎస్ షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్… అడ్డాకల్ మండలం రాచాల గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట – ముచ్చటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఈ రాచాల ఊరు… మంత్రి శ్రీనివాస్ గౌడ్ ది అంట.. కనీసం ఈ గ్రామానికి రోడ్డు కూడా లేదట అంటూ ఫైర్ అయ్యారు.
మంత్రి అయ్యాక ఊరినే మరిచిపోయాడట… డబ్బులు సంపాదన మీద ఉన్న సోయి ఈ మంత్రులకు సొంత ఊళ్ళ మీద ఉండదని మండిపడ్డారు. ఈ మంత్రి కి అసలు రాచాల గ్రామమే అంటే ఇష్టం లేదట… గట్లుండది ఈ మంత్రుల తీరు అంటూ నిప్పులు చెరిగారు.
ఈ పాలమూరు పై వైఎస్సార్ కి ఉన్న ప్రేమ ఎవరికి లేదని.. వలసల జిల్లా అని ప్రాజెక్ట్ లు కట్టించి నీళ్ళు తెచ్చారన్నారు. పాలమూరు ను సస్యశ్యామలం చేశారని… వ్యవసాయం వైఎస్సార్ హయాంలో పండుగ అని గుర్తు చేశారు. నిరుద్యోగుల కోసం ఎన్నో నోటిఫికేషన్లు వేశారని… ఇప్పుడు 8 ఏళ్లుగా సీఎం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆగ్రహించారు వైఎస్ షర్మిల.