బ్రౌజింగ్ కోసం క్రోమ్ ని వాడుతున్నారా..? వీటిని కూడా ఉపయోగించుకోచ్చు తెలుసా..?

-

ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ రావడం వల్ల మనకి పనులు త్వరగా అయిపోతున్నాయి. ఇంటర్నెట్ లో మనకు ఏదైనా సమాచారం కావాలంటే ఈజీగా మనం క్రోమ్ బ్రౌజర్ ని ఉపయోగిస్తున్నాము. అయితే క్రోమ్ బ్రౌజర్ ని మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.

 

డక్ డక్ గో:

దీని ద్వారా కూడా మనం సులభంగా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. పైగా ఇందులో ఒక్కసారే మీ బ్రౌజర్ హిస్టరీని డిలీట్ చేస్తే మొత్తం లింక్స్ అన్నింటినీ ఒకేసారి క్లోజ్ చేస్తుంది. ఈమెయిల్ ని లింక్ చెప్తే స్కాన్ చేసి వైరస్, మాల్వేర్, స్పామ్ మెసేజ్లు అన్ని డిలీట్ చేస్తుంది.

మొజిల్లా ఫైర్ ఫాక్స్:

మొజిల్లా ఫైర్ ఫాక్స్ ని కూడా మనం ఈజీగా ఉపయోగించవచ్చు. మొజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఎంతో సురక్షితమైనది. యూజర్ పాస్వర్డ్ ని భద్రంగా ఉంచుతుంది.

వివాల్డి:

దీని ద్వారా కూడా మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. క్రోమ్ తరహాలోనే డెస్క్టాప్ మొబైల్ యాప్ బ్రౌజర్ ని సింక్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి.

బ్రేవ్:

ఇది కూడా బ్రౌజింగ్ చేసుకోవడానికి మంచి యాప్. థర్డ్ పార్టీ కుకీస్ వంటి వాటిని కూడా బ్లాక్ చేస్తుంది. అలాగే ఇందులో క్రిప్టోకరెన్సీ వాలెట్ ఆప్షన్ కూడా ఉంటుంది.

ఓపెరా బ్రౌజర్:

ఇది యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. ఓపెరా మినీ బ్రౌజర్ లోని హై క్వాలిటీ డిజైన్, మంచి బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇది అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version