ల్యాప్‌టాప్స్‌, ఫోన్స్‌కు ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ కొనేప్పుడు ఛార్జింగ్‌ ఎంత ఫాస్ట్‌గా ఎక్కుతుంది.. ఎంత ఎక్కువసేపు వస్తుంది అనే చూస్తాం కానీ.. ఎప్పుడైనా వీటికి ఛార్జింగ్‌ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించారా..? అసలు ఈ డౌటే మీకు వచ్చి ఉండదు. అంత ఎక్కవ ఖర్చు అయితే మనకు కరెంట్‌ బిల్లులో తెలిసిపోతుంది కదా పెద్దగా అవ్వదు అనుకుంటాం.. కానీ అలా అనుకోవడం మీ పొరపాటే.. ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు కూడా..!

ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు ఛార్జింగ్‌ పెడితే ఎంత ఖర్చు అవుతుందనే విషయానికి సంబంధించి Ofgem ఓ నివేదికను రూపొందించింది. ప్రస్తుత విద్యుత్ ధర కిలోవాట్ అవర్(kWh)కి సుమారు 28 పౌండ్స్(యూకేలో)గా ఉంది. మొబైల్ కంపారిజన్ సైట్ Uswitch.com ప్రకారం.. మనం ప్రతిరోజూ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ‘సిఫార్సు చేయబడిన’ సమయం రెండు గంటల 40 నిమిషాలు. ఆ సంఖ్య ఆధారంగా.. ప్రతి రోజు ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి సగటు వ్యక్తికి సంవత్సరానికి 85 పౌండ్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.7,483 ఖర్చు అవుతుందట..

మీ ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జ్‌లో ఉంచినట్లయితే లేదంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఛార్జ్ చేస్తే ఆ ఖర్చు ఇంకా ఎక్కువవుతుంది. ల్యాప్‌ టాప్‌ను వాడే వారికి ఎక్కువ కరెంటు అవసరం అవుతుంది. మీ ల్యాప్‌ టాప్‌ను ఛార్జ్ చేయడానికి ఏడాదికి 12.26 పౌండ్స్ అంటే భారత కరెన్సీలో రూ. 1,077 ఖర్చు చేయాల్సి ఉంటుందట.

పెద్ద గృహ ఉపకరణాలు కలిగిన కుటుంబాలు ఈ ఖర్చును మరింతగా భరిస్తారు. UKలోని గృహాలు కొన్ని ఉపకరణాలను స్టాండ్‌బైలో ఉంచడం ద్వారా సంవత్సరానికి £2.2(193.42) బిలియన్లు ఖర్చు చేస్తున్నాయని తేలింది. రాత్రిపూట, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు వాటిని పూర్తిగా ఆపివేయడం లేదని అధ్యయనంలో తేలింది. ఇది సగటు కుటుంబానికి సంవత్సరానికి £147(రూ.12,924)కి సమానంగా చెప్పుకోవచ్చు. స్మార్ట్ స్పీకర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ రూటర్‌ లు అన్నీ ఈ డివైజ్‌ల పరిధిలోకి వస్తాయి. టీవీని ఆఫ్ చేయకుండా స్టాండ్‌ బైలో ఉంచడం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి £24.61(రూ.2,163.71) ఖర్చవుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది.

సెట్ టాప్ బాక్స్ స్టాండ్ బైలో ఉంచడం మూలంగా ఏడాదికి £23.10(రూ.2,030.95) ఖర్చు అవున్నట్లు తేలింది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే.. చాలామంది స్విఛ్‌ ఆఫ్ చేయడం మర్చిపోతారు. లైట్స్‌, ఫ్యాన్స్‌ అయితే స్విచ్ఛ్‌ ఆఫ్ చేయకపోతే తెలుస్తాయి..కానీ టీవీలు, హెయిర్‌ డ్రయర్‌, ఫోన్ ఛార్జింగ్‌ లాంటివి స్విచ్ఛ్ వేసి ఉన్నా ఏం తెలియదు.. వాటిని వాడిన తర్వాత అలా వదిలేయకుండా పని అవ్వగానే ఆపేయండి. కరెంటు ఖర్చును కొంత మేర తగ్గించుకోవచ్చు.