IQoo నుంచి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అదే iQOO 9T 5G స్మార్ట్ ఫోన్. లాంచ్‌కు ముందే ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి..
iQOO 9T 5G స్పెసిఫికేషన్స్..
iQOO 9T 5G ఫోన్ బ్లాక్, BMW లెజెండ్ ఎడిషన్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ కానుంది.
రెండు వేరియంట్‌లు డ్యూయల్-టోన్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.
కెమెరా మాడ్యూల్ చుట్టూ ఉన్న ప్రాంతం నిగనిగలాడే బ్లాక్ డిజైన్ కలిగి ఉంది. బ్లాక్ కలర్ వేరియంట్ కెమెరా మాడ్యూల్ షేపడ్ డిజైన్‌తో వచ్చింది. మరోవైపు..
BMW లెజెండ్ ఎడిషన్, బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ షాడోలతో వైట్ ప్యానెల్‌ను కలిగి ఉంది.
iQOO 9T 5G వెనుక ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది.
గింబాల్ లాంటి డిజైన్‌తో 50MP శాంసంగ్ GN5 సెన్సార్‌ను కలిగి ఉంటుందని అంటున్నారు.
13MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది.
మెరుగైన కెమెరా పర్ఫార్మెన్స్ కోసం 9T 5G Vivo V1+ ISPని కలిగి ఉంటుందని iQOO ధృవీకరించింది.
ఈ ఫోన్ FULL HD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేతో రానుంది.
16MP ఫ్రంట్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉండనుంది.
ఫోన్ బాక్స్ బయట 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4700 mAh బ్యాటరీని అందిస్తుంది.
కంపెనీ తన స్మార్ట్‌ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో ఈ నెలలో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.
iQOO 9T అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
కంపెనీ కొన్ని ఫీచర్స్‌ను ధృవీకరించింది. దాదాపు ఇదే ఫీచర్స్‌తో ఫోన్ లాంచ్ కానుంది. అయితే ఇంకా లాంచ్ డేట్‌ను కంపెనీ ప్రకటించలేదు. ధర కూడా.. రూ. 50 వేల వరకూ ఉంటుందని అంచనా. ఇదే ధరతో ఫోన్ లాంచ్ అయితే ప్రముఖ బ్రాండ్ ఫోన్లకు గట్టీ పోటీ ఇస్తుంది.