స్మార్ట్ వాచ్ లు వాడేవాళ్ళు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..

-

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లతో పాటు వాచ్ లను కూడా ఎక్కువగా వాడుతున్నారు.ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైం చూడటానికి వాడే వారు కానీ ఇప్పుడు స్మార్ట్‌ వాచ్‌ల రాకతో వాచ్‌కి అర్థమే మారిపోయింది.. బాడీ టెంపరేచర్‌ నుంచి ఆక్సిజన్‌ లెవల్స్‌ వరకు, గుండె కొట్టుకునే తీరు నుంచి ఎంత దూరం నడిచారు అన్న విషయాలను చెప్పేస్తున్నాయి. వాతావరణం అలర్ట్స్‌తో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లకు స్మార్ట్‌ వాచ్‌లు పెట్టింది పేరు. ఇలాంటి ఫీచర్స్‌లో హార్ట్ బీట్ ఒకటి. చేతికి ధరించిన స్మార్ట్ వాచ్‌ మన హార్ట్‌ బీట్‌ను ఎలా లెక్కిస్తుందనే సందేహం రావడం సర్వ సాధారణమైన విషయమే.. అయితే స్మార్ట్‌ వాచ్‌ హార్ట్‌ బీట్‌ను ఎలా చెబుతాయి.. ఆ టెక్నాలజీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

హార్ట్‌ బీట్‌ను కౌంట్ చెయ్యడానికి స్మార్ట్‌ వాచ్‌లో ఫొటోఫ్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలాగే స్మార్ట్‌ ఫోన్‌కు వెనకాల గ్రీన్‌ లైట్‌ వెలుగుతుండడాన్ని గమనించే ఉంటారు. ఈ గ్రీన్‌ లైటే మన హార్ట్‌బీట్‌ను లెక్కిస్తుంది. స్మార్ట్‌వాచ్‌ నుంచి వచ్చే గ్రీన్‌ లైట్‌ చేతి గుండాలోపలికి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో ఎరుపు రక్తంలో ఉండే బ్లడ్ గ్రీన్‌ కలర్‌ని అబ్జర్వ్‌ చేసుకుంటుంది. అయితే రక్తం లేని చోట గ్రీన్‌ లైన్‌ రిఫ్లక్ట్ అవుతుంది. రిఫ్లక్ట్ అయిన ఆ గ్రీన్‌ లైట్‌ వాచ్‌లో ఉండే ఆప్టికల్‌ సెన్సార్‌ను అది స్టోర్ చేస్తుంది..

ఇక గుండె కొట్టుకొనే సమయంలోనే రక్తం శరీరం గుండా ప్రవహిస్తుందనే విషయం తెలిసిందే. చేతిలో ప్రవహించే ఈ రక్త ప్రసారణ ఆధారంగానే స్మార్ట్‌వాచ్‌లోని గ్రీన్‌ లైట్‌ గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కిస్తుంది. హార్ట్‌బీట్‌ని బట్టి చేతిలో ప్రవహించే రక్తంలో హెచ్చుతగ్గుల ఆధారంగానే హార్ట్‌ బీట్‌ను స్మార్ట్‌ వాచ్‌ లెక్కిస్తుంది. అదండీ అసలు విషయం వాచ్ పెట్టుకోవడం ఒక్కటే కాదు ఇలాంటి ముఖ్యమైన సమాచారన్ని కూడా తెలుసుకోవడం ముఖ్యం..

Read more RELATED
Recommended to you

Latest news