హైదరాబాద్ కి సమీపంలో వున్న బీచ్లు ఇవే.. మరి ఈ వీకెండ్ కి ప్లాన్ చేసేసుకోండి..!

-

సరదాగా మీకు సమీపంలో ఉన్న బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటున్నారా..? హైదరాబాదులో ఉండే వాళ్ళకి దగ్గరగా ఈ బీచ్లు ఉన్నాయి. ఎంచక్కా ఈ వీకెండ్ కి మీరు ప్లాన్ చేసుకుని ఆ బీచ్ల లో స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సరదాగా గడపొచ్చు. సాధారణంగా హైదరాబాద్ వాసులు బీచ్లకి వెళ్లాలంటే విశాఖపట్నం, చెన్నై, గోవా, గోకర్ణ, కన్యాకుమారి వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

 

అయితే దగ్గరలో ఉన్న ఈ బీచ్లు గురించి తెలుసుకుని ఇక్కడికి వెళ్లొచ్చు. పైగా విశాఖపట్నం బీచ్, గోవా బీచ్ ఇవన్నీ దూరం పైగా ఎక్కువ రోజులు ఉండాలి. అయితే వీకెండ్ కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ బీచ్లు పర్ఫెక్ట్ గా ఉంటాయి.

బాపట్ల సూర్యలంక బీచ్

హైదరాబాద్ నుండి బాపట్లకు వెళ్లి అక్కడ నుండి సులభంగా బీచ్ కి వెళ్లిపోవచ్చు. వీకెండ్ కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ బీచ్ బాగుంటుంది.

చీరాల వోడరేవు బీచ్

హైదరాబాద్ వాసులు ఇక్కడకి వెళ్లచ్చు. వీకెండ్ కి ఇక్కడకి వెళితే ఎంతో బాగుంటుంది. హైదరాబద్ కి 300 కిలోమీటర్ల దూరంలో వుంది ఇది. బాపట్ల జిల్లాలోని చీరాల పట్టణానికి ఆరు కిలో మీటర్లే.

మచిలీపట్నం బీచ్, మంగినపూడి బీచ్

340 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి బీచ్ లేదా మచిలీపట్నం బీచ్ వుంది. వీకెండ్ కి మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ బీచ్ కి వెళ్లి సరదాగా గడిపి రావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news