పోలవరం పై మరో బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం

-

పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఇవాళ వైసిపి రాజ్యసభ సభ్యులు, సీనియర్ నేత విజయసాయిరెడ్డి… పోలవరం ప్రాజెక్టు బకాయిలపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షేకవత్ ను నిండు సభలో ప్రశ్నించారు. అయితే విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న పై కేంద్ర ప్రభుత్వం తరఫున.. జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షేకవత్ సమాధానం ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి గజేంద్ర షేకవత్ ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన సవరించిన డి పి ఆర్ అనుమతుల కోసం తమ వద్ద ఎలాంటి పెండింగులు లేవని స్పష్టం చేశారు. 2011-2019 మధ్యకాలంలోనే సవరించిన అంచనాలను ఆమోదించామని తెలిపారు మంత్రి గజేంద్ర షేకవత్ . వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పెండింగ్లు ఏమీ లేవని వెల్లడించారు. డి పి ఆర్ ను సమర్పించ లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news