‘విక్రమ్’గా కమల్ నట విశ్వరూపం..తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సూర్య కూడా కీ రోల్ ప్లే చేశారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ పిక్చర్ కు మ్యూజిక్ అందించారు.

‘ఖైదీ, మాస్టర్’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ తర్వాత లోకేశ్ కనకరాజ్ చేస్తున్న సినిమా ఇది. కాగా, నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ తో చేయనున్నారు. లోకేశ్ కనకరాజ్ ఈ సినిమాపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాగా, ఇందులో కమల్ హాసన్ తన నటవిశ్వరూపం చూపించబోతున్నారని విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news