టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువాళ్లంటే మోడీకి చిన్న చూపని, తెలుగు వాడు ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడిని అవమానించారు మోడీ అంటూ ఆయన ఆరోపించారు. తెలుగు వాడిని అవమాన పరిచారని, ఏపీకి మంత్రి లేడు… తెలంగాణ కి ఉన్నా లాభం లేదంటూ ఆయన విమర్శించారు. ఉన్న ఒక్క దత్తాత్రేయనీ తీసేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిందని, అప్పుడు ప్రజలను వంచించింది బీజేపీనేనని ఆయన ధ్వజమెత్తారు.
7 ఎంపీలు గెలిచి ప్రజలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి..తెలంగాణ మాటే ఎత్తలేదని, ఆంధ్రలో పార్టీ నీ చంపుకుని తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ అని, బడ్జెట్ సమావేశాల్లో మోడీ తెలంగాణ మనుగడ నే విమర్శించారని, తల్లిని చంపి పిల్లను ఇచ్చారు అని మోడీ అన్నారన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిన రోజు చీకటి రోజు అని మోడీ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.