ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాం…ఈటలకు బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. వార్డు మెంబర్ గా లేని ఈటెల ను మంత్రి గా చేసింది కేసీఆర్ యేనని… ఈటెల విశ్వాస ఘాతకుడు, తిన్నింటి వాసాలను లెక్క బెట్టారని నిప్పులు చెరిగారు. ఆరోగ్య మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్పడ్డాడని.. కమ్యూనిస్టు కమ్యునలిస్టుగా మారారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
హుజూరా బాద్ లో ఈటెల ఓటమి ఖాయం…అందుకే గజ్వెల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లో ఈటెలది బానిస బతుకు అని.. బీసీ, ఎస్సిల భూములు కబ్జా చేసిన నీచ చరిత్ర ఈటెల దన్నారు.
ఈటెల చిట్టాను బయటకు తెస్తాం..కబ్జా చేసిన భూములను పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. ఈటెల ఎగిరెగిరి మాట్లాడుతున్నారు ..నోరు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు..ఈటెల దమ్ముంటే మళ్ళీ హుజురాబాద్ లోనే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ లో మొన్న ఈటెల కాంగ్రెస్, రేవంత్ ల సాయం తో గెలిచారు..ఈటెల ఎక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం ఆయన నాలుక చీరేస్తామని హెచ్చరించారు.