టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇక ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్.. ఓ వైపున సినిమాలు మరో వైపున రాజకీయం రెండూ.. చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గతంలో చిరంజీవి సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. కానీ, ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి పవన్ కల్యాణ్ హీరోగా కాకుండా టెక్నీషియన్ గా ఇండస్ట్రీలో ఉండాలనుకున్నారు. కానీ, హీరోగా ప్రజల చేత విశేష ఆదరణ పొందారు. అలా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు పవన్ .
గతంలో తన సినిమాకు తానే దర్శకత్వం వహించుకుని హీరోగా నటించారు పవర్ స్టార్. ఆ పిక్చరే ‘జానీ’. కాగా, పవన్ కల్యాణ్ తన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా సినిమాలూ తీస్తున్నారు.
పవన్ కల్యాణ్ తన అన్నయ్య నాగబాబుతో కలిసి చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ ఫిల్మ్ స్టోరి డిస్కషన్స్ లోనూ పవన్ కల్యాణ్ కీ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. అలా పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ పైన పట్టు సంపాదించేందుకునేందుకు ట్రై చేసినట్లు పలువురు సినీ ప్రముఖులు చెప్తుంటారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరీశ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్ రెడ్డితో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ అనే మూవీ చేయనున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీ శ్ శంకర్ కాంబోలో రాబోయే పిక్చర్ లో పవన్ కల్యాణ్ ..లెక్చరర్ గా కనిపించనున్నారని సమాచారం.