వేసవిలో కూడా చెరువులు జలకళతో దర్శనమిస్తున్నాయి : హరీష్‌ రావు

-

తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పారు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు పదే పదే బురదజల్లె ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి హరీష్‌ రావు. కాళేశ్వరం మహా అద్భుతమని ప్రపంచ ఇంజనీర్లు మెచ్చుకుంటుంటే, ఈ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులను సాకుగా చూపిస్తూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌ రావు.

కాళేశ్వరం ద్వారా వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతోందని మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశమంతా తెలిసేలా చేశారని అన్నారు మంత్రి హరీష్‌ రావు. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలలో నీటి కోసం యుద్ధాలు జరిగేవని.. కాని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండు వేసవిలో కూడా చెరువులు జలకళతో దర్శనమిస్తున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో 49 శాతం మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోందని.. ఇంకా 51 శాతం మందికి తాగునీరు దొరకడం లేదని విమర్శించారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news