షాకింగ్‌ : సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌కు చేదు అనుభవం

-

మంత్రి కేటీఆర్ సొంత ఇలాకా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటీఆర్ భారీ బందోబస్తు మధ్య కాన్వాయ్ లో వెళ్తున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు మధ్య వెళుతున్న మంత్రి కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంజీవయ్య నగర్‌లో కేటీఆర్ కాన్వాయ్‌కి ఎదురెళ్లిన కార్యకర్తలు, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు. |  Rajanna Sirisilla...ABVP activists who blocked the convoy of Minister KTR  in Sirisilla, Rajanna Sirisilla , Minister ...

 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటిఆర్ వెంటనే రాజీనామా చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. అయితే, మంత్రి కేటిఆర్‌ను అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news