వేసవికాలం తాపంతో ఉన్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రోజు రోజుకు తెలంగాణలో ఎండల తీవ్ర పెరుగుతోంది. దీంతో.. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఐదు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే.. ఇదిలా ఉంటే.. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. రాష్ట్రం వ్యాప్తంగా రైతులు చేతికి వచ్చిన పంటలను కోల్పోయారు. దీంతో పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఎకరాలకు రూ.10వేలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. అయితే.. ఇప్పుడు మళ్లీ వర్షాలకు కురిస్తే మరోసారి తీవ్ర నష్టాన్ని చూడక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.