పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి : ఆదిమూలపు సురేష్‌

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయిన ఆదిమూలపు సురేశ్ జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్‌ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మంత్రి సురేష్. ఒక వైపు బీజేపీతో ఉంటూ మరోవైపు టీడీపీతో కలిసి పని చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు ఆయన.మునుపు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాడో పవన్ కల్యాణ్‌ సంగతి ఆయనకే తెలియదని హేళన చేశారు మంత్రి సురేష్.

Adimulapu Suresh clarifies on schools reopening, says no need to worry  about students health

మరోవైపు టీడీపీ పైన కూడా మంత్రి విమర్శల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డారు . నాలుగు ఎమ్మెల్సీలు గెలుపొందితే ఏదో సాధించేశామనే భ్రమలో టీడీపీ నేతలు ఉన్నారని… వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని వారిని హేళన చేశారు ఆయన. టీడీపీకి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని అన్నారు మంత్రి సురేష్. ఇకపోతే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లో అసలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారన్నారు. టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల సీమెన్స్ స్కామ్ జరిగిందని.. ఈ స్కాం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news