ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మచిలీపట్టణం పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలని మంచి లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంటే, దానిని భగ్నం చేయడానికి చుట్టూ రాబందుల్లా కాచుకు కూర్చున్నారని ప్రతిపక్షముపై మండిపడ్డాడు. అమరావతిలో 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటే రాక్షసమూకలు ఈ పవిత్ర యజ్ఞాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారంటూ ఆరోపించారు.
ఈ మంచి లక్ష్యాన్ని ప్రజలకు అందకుండా చేయడానికి టీడీపీ, టీడీపీకి తోడు గజ దొంగల ముఠా, దత్త పుత్రుడు మరియు కొన్ని మీడియా సంస్థలు మేము చేస్తున్న మంచి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని జగన్ తీవ్ర స్థాయిలో వారిపైనా రెచ్చిపోయి మాట్లాడారు. ఇలాంటి పేదలకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాము అంటూ వారి ప్రేమను కోరారు.