కేశినేని రాజకీయం..బెజవాడలో వైసీపీకి బెనిఫిట్.!

-

విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని..2019 ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఆయన వైఖరే డిఫరెంట్ గా ఉంటూ వస్తుంది. ఆయన టి‌డి‌పి ఎంపీగా ఉంటూ..టీడీపీలోనే నేతలతో శతృత్వం పెంచుకుంటున్నారు..అదే సమయంలో వైసీపీలో నేతలతో స్నేహం చేస్తున్నారు. ఇలా కేశినేని వైఖరి ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. అయితే బెజవాడ రాజకీయాల్లో అక్కడ ఉన్న కొందరు టి‌డి‌పి నేతలతో కేశినేనికి పడదనే సంగతి తెలిసిందే. బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, బోండా ఉమా..ఇంకా పలువురు నేతలతో కేశినేనికి పడదు.

ఇక కేశినేనికి చెక్ పెట్టాలని ఆ నేతలు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటారు. వారి మధ్య మున్సిపల్ ఎన్నికల సమయంలో పెద్ద రచ్చ నడిచింది. తర్వాత వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇక కేశినేని టి‌డి‌పి అధిష్టానంతో కూడా అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఇదే సమయంలో కేశినేనికి చెక్ పెట్టేలా ఆయన సోదరుడు కేశినేని చిన్ని బెజవాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నానికి యాంటీ గా ఉన్నవారు చిన్ని కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో నెక్స్ట్ బెజవాడ ఎంపీ సీటు చిన్నికే అనే ప్రచారం మొదలైంది.

ఇదే సమయంలో కేశినేని నాని..పార్టీతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక తన పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారు. ఇటీవల మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. తాజాగా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుతో కలిసి పనులు ప్రారంభించారు.

సరే అభివృద్ధి పనుల్లో పాల్గొనడం పెద్ద ఇబ్బందేమీ లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, ఈయన ఎంపీ కాబట్టి తప్పదు. కానీ ఆ సమయంలోనే ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉండే టి‌డి‌పి నేతలకు ఇబ్బందిగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారని కేశినేని అంటుంటే..టి‌డి‌పి నేతలకు ఇబ్బంది అవుతుంది. ఇలా కేశినేని  వ్యవహారం అర్ధం కాకుండా ఉంది. చివరికి ఆయన ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news