అన్నుకున్నదే అయింది..టీడీపీకి ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరుగుతుంది..ఏపీలో బిజేపికి యాంటీ ఉన్న మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు. విడిపోయిన తర్వాత రాష్ట్రానికి న్యాయం చేయకుండా బిజేపి అన్యాయం చేసిందనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. అందుకే గత ఎన్నికల్లో బిజేపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. ఇప్పుడు బిజేపి ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మే పరిస్తితి లేదు.
అయితే ఇంతకాలం బిజేపి..వైసీపీకి పరోక్షంగా సాయం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి..విమర్శలు ఏముంది గాని..అందులో వాస్తవం కూడా ఉంది. దీని వల్ల బిజేపిపై ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీపై పడుతుంది. కానీ ఆ వ్యతిరేకతని ఇప్పుడు టిడిపి వైపు మార్చడంలో వైసీపీ, బిజేపి కలిసి పనిచేస్తున్నాయనే విధంగా రాజకీయం నడుస్తుంది. కేంద్రంలోని బిజేపి..జగన్‌కు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు..అందుకే నిధులు, అప్పులు బాగానే ఇస్తున్నారు. కానీ ఇటీవల చంద్రబాబు సైతం..అమిత్ షా, జేపి నడ్డాతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి సీన్ మారింది. టిడిపి, జనసేనలతో బిజేపి కూడా పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం వస్తుంది.
అయితే బిజేపితో కలిస్తే టిడిపి, జనసేనకే నష్టమని సర్వేలు చెబుతున్నాయి. ఇదే తరుణంలో తాజాగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, జేపి నడ్డా..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. ఇక వీరు విమర్శలు చేయడం..వెంటనే వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం చేశారు. కేంద్రంలో కూడా తీవ్ర అవినీతి జరుగుతుందని, రాష్ట్రానికి బిజేపి చేసిందేమి లేదని, బిజేపిలో ఉన్న మాజీ తమ్ముళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
బీజేపీ కాస్త టీజేపీగా మారిందని అంటున్నారు. ఇటు జగన్ సైతం తనకు బిజేపి కూడా అండగా లేదని అంటున్నారు. అంటే ఇక్కడ బిజేపి, టిడిపి ఒక్కటే అనే విధంగా రాజకీయం నడిపిస్తున్నారు. ఇక బిజేపిపై ఉన్న వ్యతిరేకత టిడిపికి వెళుతుందనే చెప్పాలి. ఆ దిశగానే బిజేపి, వైసీపీ కలిసి స్కెచ్ వేసాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అందుకే బిజేపితో పొత్తు వద్దంటే వద్దని అంటున్నారు. మరి బాబు, పవన్ బిజేపిని కలుపుకుంటారో లేదో చూడాలి.