జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం నేర్చుకున్నారు..ఇంతకాలం ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడటం తప్ప..రాజకీయంగా వ్యూహాలు ఎలా వేయాలి..జనసేనని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు లేరు. కానీ ఇప్పుడు పవన్ ఆలోచన మారింది. ఆయన కూడా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ప్రజా నాడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారాహి యాత్రతో దూసుకెళుతున్న పవన్..ప్రజా మద్ధతు పెంచుకునే విధంగా ముందుకెళుతున్నారు.
ఓ వైపు జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూనే మరోవైపు..జనసేనని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. అయితే ఇంతకాలం జనసేనకు బలం అంటే కాపులు, పవన్ అభిమానులే..మరో వర్గం జనసేన వైపు వచ్చే పరిస్తితి లేదు..కానీ మిగిలిన వర్గాలని కూడా ఆకట్టుకోవడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. ఓ వైపు కాపు వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని ఆకర్షిస్తూనే..ఇంకా తనకు పట్టున సినిమా రంగంలోని ఇతర హీరోల ఫ్యాన్స్ మద్ధతు పొందేందుకు చూస్తున్నారు. రాష్ట్రంలో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు..అదే స్థాయిలో మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్…అలాగే పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది.
దీంతో ఆ హీరోల అభిమానుల ఓట్లు సైతం చీలిపోకుండా చేయడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు. తనకు అందరూ హీరోలు ఇష్టమే అని, అయిట్స్ సినిమాలు వేరు రాజకీయం వేరు గాని..సినిమాలకు వచ్చేసరికి ఏ హీరో అభిమాని..ఆ హీరో సినిమాని ఆదరించవచ్చు అని, కానీ రాజకీయాలకు వచ్చేసరికి అంతా ఏకం కావాలని అంటున్నారు.
దీంతో కొందరు హీరోల అభిమానులు పవన్‌కు మద్ధతు తెలపడం మొదలుపెట్టారు. ఎలాగో మెగా ఫ్యాన్స్ పవన్ వైపే ఉంటారు. అటు మహేశ్, ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టిడిపి, వైసీపీలో కూడా ఉన్నారు. ఎలాగో పవన్ టిడిపితో పొత్తు ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ కలిసొస్తారు. అయితే ఎంతవరకు ఈ హీరోల అభిమానుల ఓట్లు పవన్‌కు పడతాయో చూడాలి.