నొక్కని బటన్ల సంగతేంటి : పవన్‌

-

వైసీపీ కొంపలంటిస్తుందని.. జనసేన గుండెలంటిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్ర సందర్భంగా తనుకులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇసుక నిలిపివేసి 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంప కూల్చారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అతి వల్ల 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని పవన్ మండిపడ్డారు. ఇసుక ధరలు అందుబాటులో లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మాటి మాటికి బటన్ నొక్కారంటున్నారని, నొక్కని బటన్ల సంగతేంటని ప్రశ్నించారు. అసలు జగన్‌కు సగటు మనిషి కష్టాలు తెలుసా? అని నిలదీశారు.

Big Foul Play In Pawan Kalyan's Defeat From Bhimavaram?

‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నా కార్యకర్తపై పోలీసులు చేయి చేసుకున్నారు.. ఆ దెబ్బ నన్ను కొట్టినట్టే. శ్రీకాళహస్తి వచ్చి పోలీసులతోనే తేల్చుకుంటాను’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. ఇటీవల శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తల్లో ఒకరైన సాయిపై స్థానిక మహిళా సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సీఐ తీరుపై తాడేపల్లిగూడెంలో నాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news