ఈ రోజు అర్థరాత్రి వరకు ఐటీ రిటర్న్స్‌.. ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా

-

ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా? అయితే అలాంటి వారి కోసమే ఈ అప్డేట్. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఈరోజు ఆఖరి తేదీ. భారతదేశంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు అందరు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ కావడంతో, ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి చేసింది. అయితే.. జూలై 31వ తేదీ నాటికి 6.50 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇందులో ఈ ఒక్కరోజే సాయంత్రం ఆరు గంటల వరకు దాదాపు 36.91 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు తెలిపారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ రోజు (జులై 31) వరకు (అర్ధరాత్రి వరకు) మాత్రమే గడువు ఉంది. ప్రజలు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేలా ప్రోత్సహించేందుకు ఆదాయపు పన్ను శాఖ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

I-T Dept launches 'Jhatpat Processing' for filing income tax returns; check  details - BusinessToday

అయితే గత పదిపదిహేను రోజులుగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎన్నోచోట్ల జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగించవచ్చునని చాలామంది సీఏలు, ఐటీఆర్‌లు భావిస్తున్నారు. వరద ప్రభావిత రాష్ట్రాలలో చాలామంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడ్డారని, ఈ నేపథ్యంలో గడువు పొడిగించే అవకాశం ఉండవచ్చునని అంటున్నారు. నిన్న జులై 30 వరకు 6.13 కోట్లమంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఈ ఒక్కరోజే.. సాయంత్రం నాలుగు గంటల వరకు 26.74 లక్షల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈరోజు ఒక్క గంటలో 3.84 లక్షల మంది రిటర్న్స్ దాఖలు చేశారు. నేటి అర్ధరాత్రి వరకు రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news