మహిళలపై మూసపదాల వాడకానికి చెక్.. హ్యాండ్ బుక్ విడుదల

-

మహిళల పట్ల గౌరవాన్ని పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేవిధంగా ఉండే మూస పదజాలానికి స్వస్తి పలికింది. ఈ మేరకు వైశ్య, పతిత, విధేయత గల భార్య వంటి దాదాపు 40 పదాలను తొలగిస్తూ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేసింది సుప్రీంకోర్టు. మహిళలకు సంబంధించి ఇక నుంచి న్యాయమూర్తులు సున్నితమైన పదజాలాన్ని ఉపయోగించనున్నారు.

ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచుడ్ కొత్త హ్యాండ్ బుక్ రిలీజ్ చేశారు. గత తీర్పుల్లో వాడిన మూస పదాలు మహిళల యొక్క గౌరవాన్ని తగ్గించేవిధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సరైన తీర్పు చెప్పడానికి న్యాయమూర్తులు సహజంగానే కొన్ని పదాలను వాడాల్సి వస్తుందని చెప్పారు. న్యాయమూర్తులు ఇచ్చిన గత తీర్పులను తప్పుబట్టడం లేదని వెల్లడించారు. తీర్పుల్లో విషయాన్ని తెలపడానికి న్యాయమూర్తులు మహిళల పట్ల వాడే కొన్ని పదాలు లింగ వివక్షకు దారి తీస్తున్నాయి. వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కేసుల్లో సరైన తీర్పు వెల్లడించినప్పటికీ మూస పదాల కారణంగా ఓ వర్గానికి తెలియకుండానే అన్యాయం జరుగుతుందని సీజేఐ డీవై చంద్రచుడ్ వెల్లడించారు. సుప్రీం కోర్టు వెబ్ సైట్ లో మూస పదాలను తొలగిస్తూ హ్యాండ్ బుక్ ను అప్ లోడ్ చేశారు. మూస పదాల స్థానంలో ఆ పదాల మానసిక స్థితిని తీర్పులలో పేర్కొనాలని సుప్రీంకోర్టు హ్యాండ్ బుక్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news