ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. పాఠశాలకు వెళ్తుండగా.. ఉపాధ్యాయుడి బైకును కారుతో ఢీ కొట్టారు దుండగులు. ఆ తరువాత కిందపడిపోయిన తరువాత టీచర్ ని గొడ్డలితో నరికి అత్యంత కిరాతకండా హతమార్చారు. పోసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లా కూసుమండి మండలం నాయకన్ గూడెంకు చెందిన మారోజు వెంకటాచారి(49)ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఇతడు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగే తన స్వగ్రామం నుంచి పాఠశాలకు బయలుదేరాడు వెంకటాచారి. కానీ మార్గమధ్యలో అతడిని అత్యంత దారుణంగా హత్యచేసారు దుండగులు.
వెంకటాచారి కోసం నాయకన్ గూడెం శివారులో ముందుగా కాపు కాసుకొని ఉన్నారు దుండగులు. బైకు పాఠశాలకు బయలుదేరిన అతను ఊరి బయటికీ రాగానే కారులో రెడీ అయ్యారు. కారును వెంకటాచారి బైకు పైకి వేగంగా పోనిచ్చి ఢీ కొట్టారు. దీంతో ఉపాధ్యాయుడు కింద పడిపోవడంతో కారులోని వారు కిందికి దిగారు. మరొక వ్యక్తి బైకు పై వచ్చి గొడ్డలితో వెంకటాచారి మెడపై వేటు వేశాడు. దీంతో ఉపాధ్యాయుడు వెంకటాచారి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతను మరణించినట్టు తెలియగానే దుండగులు వెంటనే పారిపోయారు. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిని చంపిన దుండగులు ఎరుపు రంగు కారులో వచ్చినట్టు ప్రత్యక్ష్య సాక్షులు చెప్పడంతో పోలీసులు వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు.